కొత్తగా 75 లక్షల ఉజ్వల కనెక్షన్లు
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడా గ్యాస్ ధరల మోత మోగించడంతో ఎల్పీజీ సిలిండర్ ధర కొండెక్కి కూర్చొన్నది. దీని వలన ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ఎల్పీజీ వినియోగాన్ని ఆపేసి తిరిగి కట్టెల పొయ్యి వైపు మళ్లారు.
- నిధుల విడుదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
- ధరల కారణంగా 2022-23లో ఒక్కసారీ సిలిండర్‌ను రీఫిల్ చేయించని 1.18 కోట్ల మంది
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడా గ్యాస్ ధరల మోత మోగించడంతో ఎల్పీజీ సిలిండర్ ధర కొండెక్కి కూర్చొన్నది. దీని వలన ఇప్పటికే లక్షలాది కుటుంబాలు ఎల్పీజీ వినియోగాన్ని ఆపేసి తిరిగి కట్టెల పొయ్యి వైపు మళ్లారు. ఏడాదికి ఒక్కసారిగా కూడా సిలిండర్‌ను రీఫిల్ చేసుకోని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఎల్పీజీ లబ్ధిదారుల సంఖ్య అయితే కోటి కుటుంబాలకు పైనే ఉన్నది. కాగా, ఉజ్వల పథకం కింద మరో 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది.
కొత్త కనెక్షన్లకు గానూ రూ.1,650 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9.59 కోట్ల మంది పీఎంయూవై లబ్ధిదారులకు గానూ 1.18 కోట్ల మంది(12 శాతం) కనీసం ఒక్కసారి కూడా తమ సిలిండర్‌ను రీఫిల్ చేయించుకోలేదని కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. మరికొంత మంది లబ్ధిదారులు ఒకటి లేదా రెండుసార్లు రీఫిల్లింగ్కే పరిమితం అయ్యారు. కాగా, గత నెల వరకు 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ రూ.1,150కు పైగా పలుకగా.. లోక్‌సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఇటీవల గ్యాస్ ధరలను రూ.200 తగ్గిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
మూడో దశ ఈ-కోర్ట్ ప్రాజెక్టుకు ఆమోదంమూడో దశ ఈ-కోర్ట్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. నాలుగేళ్లలో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు రూ.7,210 కోట్లు ఖర్చవుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

