ముంబై, జూలై 9: 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసుకొన్న ఒప్పందాన్ని బీజేపీ గౌరవించి ఉంటే.. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇతర పార్టీలకు రెడ్‌కార్పెట్ పరిచే గతి పట్టేది కాదు కదా! అని శివసేన(యూబీటీ) అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పొత్తులో భాగంగా బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా, తన మధ్య సీఎం సీటు షేరింగ్ ఒప్పందం జరిగిందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. విదర్భ పర్యటనలో భాగంగా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ‘అప్రతిష్ట’ వ్యక్తులను బీజేపీ ఎలా డీల్ చేస్తుందో చూడాల్సి ఉన్నదని అజిత్ పవార్ వర్గం చేరికను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.