బెంగళూరు: బెంగళూరు మెట్రో చార్జీలను అసాధారణంగా పెంచటంపై కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ప్రజా ఆగ్రహానికి గురైంది. దీంతో పెంచిన చార్జీలపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మొత్తంగా బెంగళూరు మెట్రో చార్జీలను 30 శాతం వరకు తగ్గిస్తూ ‘బీఎంఆర్సీఎల్’ గురువారం నిర్ణయం తీసుకుంది. ధరల మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని కార్పొరేషన్ ఎండీ మహేశ్వర్ రావ్ ప్రకటించారు.
ప్రజలు, మెట్రో చార్జీల్ని 47శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈనెల 9 నుంచి అమల్లోకి రాగా, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. సోషల్ మీడియా ‘ఎక్స్’లో హ్యాష్‌ట్యాగ్ ‘బాయ్‌కాట్ మెట్రో’ పెద్ద ఎత్తున సాగింది. ఇటీవల చార్జీల పెంపుతో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకూ బాగా తగ్గింది.