Two wheelers | జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ద్విచక్ర వాహనాలకు (Two wheelers) టోల్ నుంచి మినహాయింపు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇకపై టూవీలర్స్ కూడా టోల్ కట్టాల్సి (Pay Toll) ఉంటుందట. ద్విచక్ర వాహనాల నుంచి టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ఫోర్ వీలర్స్, ఇతర పెద్ద వాహనాలకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల ఆటోలు టోల్ కట్టకుండానే జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నాయి. అయితే, ఈ విధానంలో మార్పునకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. వచ్చే నెల అంటే జులై 15 నుంచి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరలోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ద్విచక్ర వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
Also Read..
SCO Declaration: ఎస్సీవో డిక్లరేషన్‌పై సంతకం చేయని రాజ్‌నాథ్ సింగ్
Reels | రీల్స్ పిచ్చి.. 13వ అంతస్తుపై నుంచి పడి యువతి మృతి
Shubhanshu Shukla | జీరో గ్రావిటీకి అలవాటు పడుతున్నా.. అంతరిక్షం నుంచి శుభాన్షు శుక్లా సందేశం