చెన్నై: గబ్బిలాలను వేటాడి, వాటితో వంటకాన్ని తయారుచేసి, కోడిమాంసంగా అమ్ముతున్న ఒక ముఠా తమిళనాడులో పట్టుబడింది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను తమిళనాడు సేలం జిల్లాలో అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వేటాడిన గబ్బిలాలతో వంటకాన్ని తయారుచేసి, కోడిమాంసంగా చెబుతూ ఒమాల్పూర్కు దగ్గర్లో దానిషపెట్టాయ్ వద్ద ఇతరులకు దానిని అమ్ముతున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది. తోప్పూర్ రామస్వామి అటవీ పరిధిలో అనేకమార్లు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించటంతో అటవీ శాఖ సెర్చ్ ఆపరేషన్ చేసి నిందితులను పట్టుకుంది.