న్యూఢిల్లీ: ఇద్దరు దురుసు ప్రయాణికుల వల్ల సోమవారం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం ఏడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఎయిర్ కండీషన్ పని చేయడం లేదని ఇద్దరు ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం.
విమానం రన్ వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది. పైలట్, సిబ్బంది, సహ ప్రయాణికులు ఎంతగా నచ్చ చెప్పినా ఆ ఇద్దరు ప్రయాణికులు తమ ప్రవర్తన మార్చుకోకపోవడంతో కెప్టెన్ విమానాన్ని మళ్లీ వెనక్కి తెచ్చి నిలుపు స్థానం(బే)లో ఉంచాల్సి వచ్చింది.