ముంబై : మహారాష్ర్టలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈతపల్లి ఫారెస్టు ఏరియాలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ హతమైనట్లు గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ స్పష్టం చేశారు. ఘటనాస్థలి నుంచి నక్సల్స్‌కు సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Two naxals killed in an encounter with Police in the forest area of Etapalli in Gadchiroli district. Incriminating material seized from the spot: Ankit Goyal, SP Gadchiroli#Maharashtra
— ANI (@ANI) April 28, 2021