బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoist) మరణించారు. శనివారం ఉదయం 8 గంటలకు కాంకేర్ (Kanker) జిల్లాలోని కోయిలిబేడా (Koylibeda) పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమ్ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG) ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని బస్తర్ (Bastar) ఐజీ పీ. సుందర్రాజ్ (IG Sunderraj) చెప్పారు. ఘటనా స్థలంలో ఐఎన్ఎస్ఏ రైఫిల్, 12 బోర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఈ నెల 17న కూడా బీజాపూర్ జిల్లా మద్దేడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మరణించారు. మృతుడిని మద్దేడు ఏరియా కమిటీ ఇన్చార్జీ, డివిజనల్ కమిటీ మెంబర్ పదం నగేశ్‌గా గుర్తించారు. ఆయనపై రూ.8 లక్షల రివార్డు ఉందని ఐజీ వెల్లడించారు.