బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. శుక్రవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పరిధి నేంద్ర, పన్నూరు అడవుల్లో పోలీసులు కూంబీంగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు తారసపడిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రాతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. కాల్పుల అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభించాయన్నారు. ఘటనా స్థలంలో రెండు బోర్ గన్లు, నక్సల్ యూనిఫామ్, ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
గురువారం దంకారుణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లోని దక్షిణ అబూజ్మడ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశమవుతున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో నారాయణ్‌పూర్ జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ) బలగాలతో పాటు దంతేవాడ, బస్తర్, కొండగావ్ జిల్లాల సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరికి మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టుల మృతి చెందారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ డివిజన్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 217 మంది మావోయిస్టులు మృతిచెందారు.
Bijapur, Chhattisgarh: 2 Naxalites killed in an encounter with security forces in Nendra-Punnur forests under Basaguda police station area this morning. Two 12 bore guns, Naxal uniforms, literature, explosives and other Naxal material recovered from the spot: Police
— ANI (@ANI) December 13, 2024