రాంచీ, మే 24: జార్ఖండ్ జన్ ముక్తి పరిషద్‌కు చెందిన అగ్రనేతతో సహా ఇద్దరు మావోయిస్టులు శనివారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించారు. జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అగ్రనేత పప్పూ లోహరా, మరో కీలక నాయకుడు ప్రభాత్ గుంంఝు భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించినట్లు భద్రతా దళాలు తెలిపాయి.
పప్పూ లోహరాపై రూ.10 లక్షలు, ప్రభాత్ గుంఝుపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. గాయపడిన మరో నక్సలైట్‌ని అరెస్టు చేసినట్లు వారు చెప్పారు. భద్రతా దళాల ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.