లండన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాదీల మృతి
లండన్‌లో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి రెండు కారుల్లో తిరిగి వస్తుండగా ఒకదానినొకటి ఢీకొనడంతో నాదర్గుల్కు చెందిన తర్రె చైతన్య యాదవ్ (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ రాపోలు (21) మృతి చెందారు.
- వినాయక నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా ఘటన
బడంగ్‌పేట, సెప్టెంబర్ 2 : లండన్‌లో చదువుకునేందుకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు వినాయక నిమజ్జనానికి వెళ్లి రెండు కారుల్లో తిరిగి వస్తుండగా ఒకదానినొకటి ఢీకొనడంతో నాదర్గుల్కు చెందిన తర్రె చైతన్య యాదవ్ (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ రాపోలు (21) మృతి చెందారు. ఈ ప్రమాదంలో నూతన్ తాటికాయలకు పక్షవాతం రాగా, సాయి గౌతమ్ రావుళ్ల వెంటిలేటర్‌పై ఉన్నాడు.
ఈ ప్రమాదానికి సంబంధించి ఇద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకోగా, మిగిలిన వారు రాయల్ లండన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. యూకేలోని ఎస్సెక్స్ నగరంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన డ్రైవింగ్ కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్టు ఎస్సెక్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మరణించిన చైతన్య యాదవ్ బాలాపూర్ మండలం నాదర్గుల్కు చెందిన ఐలయ్య, మల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు. ఎంటెక్ చదవడానికి ఏడు నెలల క్రితం లండన్‌కు వెళ్లాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

