తొమ్మిదేళ్ల బాలుడు మూత్రం పోస్తుండగా వీడియో తీసి, గ్రూప్లో షేర్ చేసినందుకు ముంబైలోని హౌసింగ్ సొసైటీకి చెందిన ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తూర్పు శివారు ములుండ్లోని హౌసింగ్ సొసైటీలో ఓ తొమ్మిదేళ్ల బాలుడు భవనం మెట్లమీద మూత్రం పోస్తున్న వీడియోను సొసైటీ కార్యదర్శి, సభ్యుడు స్థానిక గ్రూపుల్లో షేర్చేశారు. సీసీటీవీ ఫుటేజీని వీరిద్దరూ సేకరించి, అన్ని గ్రూప్లుల్లో ఫార్వర్డ్ చేశారు. బాలుడి తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో మైనర్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు,ఫొటోలు లేదా నివేదికలను పోస్ట్ చేయడం లేదా మీడియాలో పిల్లల గోప్యతకు భంగం కలిగించడం లాంటి పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదైంది. దీనిపై ములుంద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.