కర్ణాటకలో కలుషితనీరు తాగి మరొకరి మృతి
కలుషిత నీరుతాగి కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్లో ఇద్దరు మృతిచెందిన ఘటన మరువకముందే బెళగావి జిల్లాలో మరొక విషాదం చోటుచేసుకొన్నది. కలుషిత నీరు తాగి 70 ఏండ్ల వృద్ధుడు మృత్యువాతపడ్డాడు. ముదేనూరు గ్రామంలో తాజా మరణం నమోదైంది
- బెళగావి జిల్లాలో 94 మందికి అస్వస్థత
బెంగళూరు, అక్టోబర్ 27: కలుషిత నీరుతాగి కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్లో ఇద్దరు మృతిచెందిన ఘటన మరువకముందే బెళగావి జిల్లాలో మరొక విషాదం చోటుచేసుకొన్నది. కలుషిత నీరు తాగి 70 ఏండ్ల వృద్ధుడు మృత్యువాతపడ్డాడు. ముదేనూరు గ్రామంలో తాజా మరణం నమోదైంది. ఈ గ్రామంలో కలుషిత నీరుతాగి 94 మంది దవాఖాన పాలయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
శివప్ప అనే వృద్ధుడు (70) మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం శివప్ప అస్వస్థతకు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. అక్టోబర్ 23న నల్లా పైపు పగిలిపోయి తాగేనీటిలో కలుషిత నీరు కలిసిందని తెలిపారు. ఈ నీటిని తాగినవారందరికీ వాంతులు, విరేచనాలు, కడపునొప్పిలాంటి లక్షణాలు కనిపించాయన్నారు. పెద్దసంఖ్యలో దవాఖానపాలైనా బీజేపీ సర్కారు పట్టించుకోవడం లేదని ముదేనూరు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇంతవరకూ ప్రజాప్రతినిధులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

