కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఇద్దరికి కరోనా.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్
Covid-19 | చైనా, జపాన్, దక్షిణకొరియా దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఆయా దేశాల్లో
కోల్‌కతా: చైనా, జపాన్, దక్షిణకొరియా దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. ఆయా దేశాల్లో కలకలం రేపుతున్న ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంటే భారత్‌లోనూ బయటపడింది. ఇటీవల గుజరాత్లో ఇద్దరిలో, ఒడిశాలో ఒకరిలో బీఎఫ్.7 ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దాంతో వారిని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారు.
దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి విదేశాల నుంచి వచ్చే దేశీ, విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం యూపీలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇవాళ ఉదయం బీహార్‌లో నలుగురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దాంతో వారిని ఐసోలేషన్‌లో పెట్టి, వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించారు.
తాజాగా కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒకరు ఈ నెల 24న దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తి కౌలాలంపూర్ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. ఇద్దరి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BF.7 Variant
- china
- Covid-19
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

