Earthquake | కచ్‌లో 7 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూ ప్రకంపణలు
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో 7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం రాత్రి 10.12 గంటల సమయంలో 3.4 తీవ్రతతో తొలిసారి భూమి కపించింది. మళ్లీ 7 నిమిషాల తర్వాత ప్రకంపణలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
అహ్మదాబాద్: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో 7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం రాత్రి 10.12 గంటల సమయంలో 3.4 తీవ్రతతో తొలిసారి భూమి కపించింది. మళ్లీ 7 నిమిషాల తర్వాత ప్రకంపణలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భచా (Bhachau)కు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని ఇన్స్టిట్యూట్ ఆప్ సీస్మొలాజికల్ రీసెర్చ్ (ISR) వెల్లడించింది.
రాత్రి 10.19 గంటల సమయంలో 2.7 తీవ్రతతో భూమి కంపించిందని తెలిపింది. రాపార్కు 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొంది. వరుస భూకంపాల వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. కాగా, కచ్ అత్యంత ప్రమాదకర భూకంప జోన్లో ఉన్నది. జిల్లాలో 2001లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. 7.8 తీవ్రతతో వచ్చిన ప్రకంపణలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో వేలాది మంది చనిపోయారు.
గురువారం రాత్రి 11.56 గంటల సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. దీని తీవ్రత 3.0గా నమోదయింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) తెలిపింది.
EQ of M: 3.0, On: 21/08/2025 23:56:42 IST, Lat: 27.00 N, Long: 95.42 E, Depth: 5 Km, Location: Tirap, Arunachal Pradesh.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/kpT0ch46vz— National Center for Seismology (@NCS_Earthquake) August 21, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

