న్యూఢిల్లీ : వాయుసేనకు చెందిన రెండు విమానాలు శుక్రవారం వేర్వేరు చోట్ల కూలిపోయాయి. రవాణా విమానం ఏఎన్-32 శుక్రవారం పశ్చిమ బెంగాల్లోని బగ్డోగ్రా విమానాశ్రయం వద్ద ప్రమాదవశాత్తూ కూలిపోయింది. సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
శుక్రవారం ఉదయం ఐఏఎఫ్ జాగ్వార్ విమానం కూడా హర్యానాలోని అంబాలాలో కూలిపోయింది. శిక్షణ కోసం వెళ్లినపుడు ఈ సంఘటన జరిగింది. దీనిలోని పైలట్ కూడా సురక్షితంగా బయటపడ్డారు.