పూరీ : బీజేపీ పాలిత ఒడిశాలోని పూరీ సముద్ర తీరం సమీపంలో ఓ కళాశాల విద్యార్థిని (19) సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ నెల 13న ఈ ఘటన జరగ్గా, 15న బాధితురాలు ఆ షాక్ నుంచి తేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. తన స్నేహితుడితో కలిసి ఆమె మొదట బలిహర్ చంద్ గుడికి అక్కడి నుంచి దగ్గరలోని అడవికి వెళ్లింది.
అప్పటికే అక్కడ ఉన్న నిందితులు బాధితురాలు, ఆమె స్నేహితుడిని వీడియో తీసి డబ్బులివ్వాలని బెదిరించారు. బాధితురాలి స్నేహితుడు డబ్బులివ్వడానికి నిరాకరించడంతో అతడి చేతులు కట్టేశారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు యువతిపై అత్యాచారం చేశారు.