Twitter India | సాంకేతిక సమస్యల కారణంగా ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. పలువురు వినియోగదారులు రాత్రి 7 గంటల తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్లో 1,747 మంది వినియోగదారులు ట్విట్టర్లో సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. 63శాతం మంది వినియోగదారులు యాప్‌లో కొత్త ట్వీట్లు లోడ్ చేయడంలో సమస్య ఉన్నట్లు పేర్కొన్నారు. 36శాతం మంది వెబ్‌సైట్‌పై, ఒకశాతం ట్వీట్‌ను అప్లోడ్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. శనివారం గూగుల్ జీ-మెయిల్స్ సర్వీసులు కొద్దిసేపు ప్రభావితమైన విషయం తెలిసిందే. చాలా మంది వినియోగదారులు సర్వర్ డౌన్ అయినట్లు ఫిర్యాదు చేశారు. చాలా మంది డెస్క్‌టాప్‌తో పాటు యాప్ వర్షెన్లలో సమస్యలు ఎదుర్కొన్నారు. గత జూలైలో ట్విట్టర్ సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. గత ఫిబ్రవరిలో రెండుసార్లు ట్విట్టర్ సేవలను నిలిచిపోయాయి.