Twisha Sharma | రెండో అటాప్సీ తర్వాత త్విషా శర్మ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత.. అత్తవారింట్లో అంత్యక్రియలు పూర్తి
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విషా శర్మ మరణించిన 12 రోజుల తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్విషా శర్మ మరణించిన 12 రోజుల తర్వాత ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు భోపాల్‌లోని ఎయిమ్స్‌లో ఢిల్లీకి చెందిన నలుగురు వైద్యులు త్విషా మృతదేహానికి రెండోసారి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు.
అనంతరం ఆమె మృతదేహాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం త్విషా శర్మ అత్తగారిల్లు అయిన భోపాల్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మోడల్, నటి అయిన త్విషా శర్మ ఈ నెల 12న భోపాల్‌లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆమె ఇంటిపై ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆమె భర్త గత శుక్రవారం లొంగిపోయాడు. కోర్టు అతడికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
త్విషా శర్మ అంత్యక్రియల సందర్భంగా అక్కడ విషాధ ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు, యువత, మహిళలు అంత్యక్రియల్లో భారీగా పాల్గొన్నారు. త్విషా శర్మ ఆత్మశాంతికి అందరూ ప్రార్థించాలని ఆమె తండ్రి కోరారు. త్విష మృతి ఘటనలో న్యాయం జరగాలని కుటుంబ సభ్యులు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

