Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. కోర్టులో లొంగిపోనున్న భర్త.. రెండో అటాప్సీకి హైకోర్టు ఓకే
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్విషా మరణించిన 10 రోజుల తర్వాత ఆమె భర్త సమర్ద్ సింగ్ లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు.
Twisha Sharma : సంచలనం సృష్టించిన త్విషా శర్మ మృతి కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. త్విషా మరణించిన 10 రోజుల తర్వాత ఆమె భర్త సమర్ద్ సింగ్ లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు అతడి తరఫు లాయర్లు మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. అంతేకాదు.. అతడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కూడా కోర్టుకు తెలిపారు.
మరోవైపు త్విషా శర్మ మృతదేహానికి రెండోసారి అటాప్సీ నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా అనుమతించింది. రెండోసారి అటాప్సీని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, తాజాగా మరోసారి అటాప్సీకి హైకోర్టు అనుమతించింది. త్విషా శర్మ మరణించి 10 రోజులు అవుతున్నా.. ఆమె మృతదేహం భోపాల్‌లోని ఎయిమ్స్ మార్చురీలో ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజులు ఆమె మృతదేహాన్ని అలా ఉంచడం సరికాదని భావించిన హైకోర్టు.. ఆమె కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు రెండోసారి అటాప్సీ, ఫోరెన్సిక్ అనాలసిస్ నిర్వహించాలని ఆదేశించింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించింది.
మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించేందుకు కూడా భోపాల్ ప్రభుత్వం అంగీకరించింది. ఆమె కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మే 12న త్విషా శర్మ భోపాల్‌లో అనుమానాస్పదంగా ఉరి వేసుకుని మరణించింది. ఆమెది ఆత్మహత్య కాదు.. హత్య అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. భర్త, అతడి కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే ఆమె మరణించిందని ఆరోపించారు. దీంతో ఈ అంశం సంచలనంగా మారింది. మరోవైపు ఆమె భర్త సమర్ధ్ సింగ్ ఘటన జరిగిన తర్వాతి నుంచి పరారీలో ఉన్నాడు. 10 రోజులైనా ఇంకా అతడిని పోలీసులు అరెస్టు చేయలేకపోయారు.
పైగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఈ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ సాగుతుండగా.. తాజాగా ఈ పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటున్నట్లు, ప్రధాన నిందితుడైన సమర్ద్ లొంగిపోనున్నట్లు కోర్టుకు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

