విశాఖపట్నం : డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ఆంధ్రప్రదేశ్‌లో తన కలల అకాడమీని ఏర్పాటు చేస్తోంది. బుధవారం విశాఖపట్నంలో ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో కలిసి అకాడమీకి శంకుస్థాపన చేసింది. అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో ‘సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్’ నిర్మాణ పనులకు లోకేశ్ భూమిపూజ చేశారు.
రాబోయే వందేండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ అకాడమీని రూపొందిస్తున్నట్టు ఈ సందర్భంగా సింధు తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో ఇండోర్ షూటింగ్ రేంజ్ సహా ఏడు క్రీడా విభాగాలు అందుబాటులో ఉన్నాయని, ఔత్సాహిక క్రీడాకారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపింది.