Zaheer Khan | చెన్నై సూపర్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్.. ఐపీఎల్ 2027 కోసం జట్టు కీలక నిర్ణయం
Zaheer Khan : ఐపీఎల్లో ప్రధాన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రధాన కోచ్‌గా ఇండియన్ మాజీ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించింది.
Zaheer Khan : ఐపీఎల్లో ప్రధాన జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రధాన కోచ్‌గా ఇండియన్ మాజీ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించింది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కోసం జహీర్ ఖాన్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మేరకు జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఇంతకుముందు ఈ జట్టుకు కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరించారు. ఇప్పుడు ఆయన స్థానంలో జహీర్‌ను ఎంపిక చేశారు. ఇప్పటివరకు 16 ఐపీఎల్ టోర్నీలలో పాల్గొన్న సీఎస్కే.. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, కొంతకాలంగా సీఎస్కే అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతోంది. గతంలో ఎమ్మెస్ ధోని నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. చివరగా 2023లో ధోని నాయకత్వంలోనే ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత నుంచి జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా మారాడు. కానీ, అనుకున్న స్థాయిలో జట్టు ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయింది
Left Arm “Taking” Over! 💫🦁
Welcoming Zaheer Khan as the Head Coach of Chennai Super Kings!#WhistlePodu #Yellove 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) September 21, 2026
ఈ ఏడాది జరిగిన సీజన్లో సీఎస్కే పేలవ ప్రదర్శన చేసింది. ఆడిన 14 మ్యాచుల్లో ఆరు మ్యాచులు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. నాకౌట్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. దీంతో జట్టును వచ్చే సీజన్ కోసం మరింత బలంగా మార్చాలని యాజమాన్యం భావించింది. అందుకు తగ్గట్లే జట్టులో మార్పులు చేస్తోంది. అందుకోసమే హెడ్ కోచ్‌గా ఫ్లెమింగ్‌ను తొలగించి జహీర్ ఖాన్‌ను నియమించింది. ఐపీఎల్ 2027 సీజన్లో జహీర్ ఖాన్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

