Maganur | సమస్యలపై అధికారులను, సర్పంచ్ను నిలదీసిన గ్రామస్థులు
Maganur | నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం దొడ్డి గ్రామంలో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో అధికారు లు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు( Maganur ) మండలం నేరడగం దొడ్డి
గ్రామంలో నెలకొన్న మౌలిక సమస్యలను ( Basic Issues ) పరిష్కరించడంలో అధికారు లు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన గ్రామసభలో కరెంటు ( Power ), తాగునీరు ( Drinking Water ) , మురుగు కాలువలు, దోమల బెడద, పారిశుధ్యం, వీధిలైట్ల తదితర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పలు వీధుల్లో మురుగు కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోతోం దని, దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టడం లేదని, వీధిలైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యత ప్రజాప్రతినిధులపై, ముఖ్యంగా సర్పంచ్ ఉందని అన్నారు. ఉపాధి హామీ పనుల నిర్వహణపైనా పలు ఆరోపణలు చేశారు. పనులకు హాజరుకాని వారికి కూడా హాజరు నమోదు చేస్తున్నారంటూ ఆరోపించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

