గుప్త నిధుల తవ్వకాలు.. పరారీలోని ముగ్గురిలో ఇద్దరి అరెస్ట్
నిజాం కాలం నాటి మసీదు వద్ద గుప్త నిధుల కోసం రాత్రివేళ తవ్వకాలు చేపట్టిన వారిలో 12 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలంలోని అనాజీపురం రెవెన్యూ పరిధి రాజాపేటలో చోటుచేసుకుంది.
పెన్పహాడ్, సెప్టెంబర్ 21 : నిజాం కాలం నాటి మసీదు వద్ద గుప్త నిధుల కోసం రాత్రివేళ తవ్వకాలు చేపట్టిన వారిలో 12 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ ఘటన పెన్పహాడ్ మండలంలోని అనాజీపురం రెవెన్యూ పరిధి రాజాపేటలో చోటుచేసుకుంది. సూర్యాపేట సర్కిల్ కార్యాలయంలో పెన్పహాడ్ ఎస్ఐ బాలునాయక్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాజశేఖర్ కేసు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 16న రాత్రి రాజాపేటలోని పురాతన మసీదు భవనం, పరిసరాల్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని 13 మందిలో 10 మందిని అదుపులోకి తీసుకున్న విషయం విదతమే. కాగా పరారైన ముగ్గురిలో ఇద్దరిని అనంతరం పట్టుకున్నారు. కాసారబాదకు చెందిన కొమరాజు నరసింహ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. దొంగరి మధన్, షేక్ సైదా, సయ్యద్ అమీర్ అలీ, షేక్ రహమాన్ రఫీ, షేక్ అహమ్మద్, షేక్ మహ్మద్ రఫీ, మైనుద్దీన్, మహ్మద్ సుల్తానా మియా, మహ్మద్ యాసిన్, మీనయ్య, సయ్యద్ అక్బర్, రూపాని వెంకన్న ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

