చెన్నై : ‘వన్ నేషన్, వన్ పోల్(జమిలీ ఎన్నికలు)’ అంటే ‘ప్రజాస్వామ్యం హత్య’ అని నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మండిపడ్డారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ యాత్రను ఆయన శనివారం ప్రారంభించారు. అరియలూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను విమర్శించారు.
తమిళనాడు వంటి దక్షిణాది రాష్ర్టాల్లోని ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసిందన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, నియోజకవర్గాల పునర్విభజన దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న ద్రోహానికి మరో రూపమని ఆరోపించారు. బీజేపీ ఎంతో దుర్మార్గమైనదని, బీహార్‌లో 60 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని చెప్పారు.