చెన్నై : తమిళగ వెట్రి కజగం పార్టీని తమిళనాడు, పుదుచ్చేరిలో అధికారిక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జాతీయ ఎన్నికల కమిషన్ గుర్తించిందని సీఎం విజయ్ గురువారం తెలిపారు. విజిల్ గుర్తును అధికారిక గుర్తుగా ఎన్నికల కమిషన్ గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
తన పార్టీ ద్వారా ప్రజాస్వామ్యంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నామని.. దీనికి నేడు గుర్తింపు రావడానికి ప్రజల ఆదరణే కారణం అని సీఎం విజయ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో తాము చేస్తున్న సంస్కరణలకు విజిల్ గుర్తుగా నిలిచిందన్నారు. తక్కువ కాలంలోనే తన పార్టీని ప్రజలు ఆదరించారన్నారు.