ఢిల్లీ : వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన భారత యువ సంచలనం తన్వి శర్మ క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో తన్వి 26-24, 21-12తో ఫన్నాచెట్ (థాయ్‌లాండ్)ను వరుస గేమ్స్‌లో ఓడించింది. క్వార్టర్స్‌లో ఆమె భారత్‌కే చెందిన మాళవిక బన్సోద్తో తలపడనుంది. ఈ ఇద్దరే గాక ఇష్రాణి, రక్షిత రామ్రాజ్ సైతం క్వార్టర్స్ చేరారు.
మెన్స్ సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్.. 21-15, 13-21, 21-14తో వు ఝి యింగ్ (తైవాన్)పై గెలిచి లాస్ట్-8కు అర్హత సాధించాడు. కిరణ్ జార్జ్.. 12-21, 21-10, 18-21తో భారత షట్లర్ సరస్వత్ చేతిలో ఓడగా హైదరాబాదీ షట్లర్ మన్నెపల్లి తరుణ్ పోరాటం సైతం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది.