హైదరాబాద్, సెప్టెంబర్ 10: గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీ) అడ్డాగా హైదరాబాద్ మారుతున్నది. భారతదేశపు గ్లోబల్ కెపాబిలిటీ క్యాపిటల్‌గా నగరాన్ని నిలబెట్టడానికి అనరాక్తో కలిసి ఫిక్కీ ప్రత్యేకంగా హైదరాబాద్ 2035 పేరుతో నివేదికను విడుదల చేసింది. రియల్ ఎస్టేట్ ఏకోసిస్టమ్స్, మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక విలువ పుంజుకోవడం వంటి పరిణామాలు నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాయని పేర్కొంది. ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లో 52 లక్షల చదరపు అడుగుల వాణిజ్య స్థలం లీజు/విక్రయాలు జరిగాయని, వీటిలో 40 శాతం నుంచి 45 శాతం జీసీసీలే ఆక్రమించాయని టెర్మినస్ గ్రూపు సీఎండదీ ఎస్పీ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 500కి పైగా జీసీసీలు ఉన్నాయని, వీటిలో 3 లక్షలకు పైగా నిపుణులు పనిచేస్తున్నారు.