Actor Vijay : ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ్టి నుంచి ఎన్నికల వరకు ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయనున్నారు. విజయ్ పార్టీని స్థాపించిన తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి.
తమిళనాడు అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీని స్థాపించిన విజయ్ ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో తిరుచ్చికి వచ్చిన విజయ్‌కి ఘన స్వాగతం లభించింది.
తిరుచ్చి ఎయిర్‌పోర్టులో విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. టీవీకే కార్యకర్తలు తమ అభిమాన నాయకుడి ముందు పార్టీ జెండాలను ఊపుతూ వెల్కమ్ చెప్పారు. పలువురు విజయ్ ఫొటోలను ప్రదర్శించారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చిన విజయ్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రచారం వాహనం ఎక్కారు. ప్రజలకు అబివాదం చేస్తూ ముందుకు కదిలారు.
#WATCH | Tamil Nadu: TVK chief and actor Vijay to begin his statewide campaign today in Trichy district. Visuals from the city as a huge crowd of his party cadres and supporters gather to welcome him. pic.twitter.com/d2VIhAMklx
— ANI (@ANI) September 13, 2025
#WATCH | Tamil Nadu: TVK chief and actor Vijay to begin his statewide campaign today in Trichy district. Visuals from the city as his party cadres and supporters gather to welcome him. pic.twitter.com/RgbtPBbzr6
— ANI (@ANI) September 13, 2025
#WATCH | Tamil Nadu: TVK chief and actor Vijay arrives in Trichy. He is beginning his statewide campaign today. pic.twitter.com/45Be1C8lFG
— ANI (@ANI) September 13, 2025
#WATCH | Tamil Nadu: TVK chief and actor Vijay arrives in Trichy. He is beginning his statewide campaign today. pic.twitter.com/LktT8wy36Z
— ANI (@ANI) September 13, 2025