న్యూఢిల్లీ: జంతువులు కొన్నిసార్లు వింతగా ప్రవర్తిస్తాయి. అవి చేసే చేష్టలు ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే కొన్నిసార్లు భయం కూడా కలిగిస్తాయి. అలాంటి ఒక సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. సాధారణంగా తాబేళ్లు చాలా కూల్‌గా ఉంటాయి. అయితే ఒక తాబేలు (Turtle) మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. తాగు నీరు ఇచ్చిన మహిళపై దాడికి అది ప్రయత్నించింది. చాలా దాహంతో ఉన్న తాబేలును ఒక మహిళ గుర్తించింది. తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీరు పోసింది. దీంతో ఆ తాబేలు నోరు తెరిచి మంచి నీటిని తాగింది. కాస్త దూరంగా ఉన్న ఆ మహిళ కొన్ని సెకండ్ల తర్వాత మరోసారి బాటిల్ నుంచి నీటిని తాబేలు నోటిలో పోసింది. అయితే ఆ తాబేలు ఒక్కసారిగా నోటిని పెద్దగా తెరిచి ఆ మహిళపై దాడి చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఆమె షాక్ కావడంతోపాటు భయపడింది. అయితే ఫెన్సింగ్ అడ్డుగా ఉండటంతో తాబేలు దాడి నుంచి ఆమె తప్పించుకుంది.
కాగా, ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు 40 లక్షల మంది ఈ వీడియోను చూశారు. 40 వేల మందికిపైగా లైక్ చేశారు. కొందరు నెటిజన్లు ఈ వీడియో క్లిప్‌పై భిన్నంగా స్పందించారు. ఫన్నీగా కామెంట్లు చేశారు. తాబేలు దాడి చూసి తాము చాలా భయపడినట్లు కొందరు పేర్కొన్నారు. తాగు నీరు పోసిన మహిళ పట్ల ఆ తాబేలుకు కృతజ్ఞత లేదని ఒకరు వ్యాఖ్యానించారు. నీరు చాలంటూ అది అలా చెప్పిందని మరొకరు చమత్కరించారు.
— Strangest Media Online (@StrangestMedia) May 10, 2023