న్యూఢిల్లీ, మే 14: భారత్ కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్‌లో తుర్కియే సైన్యానికి చెందిన ఇద్దరు డ్రోన్ ఆపరేటర్లు మరణించారు. దీంతో పాకిస్థాన్‌కు సాయంగా 350కి పైగా డ్రోన్లనే కాకుండా వాటి ఆపరేటర్లను కూడా తుర్కియే పంపించినట్లు బహిర్గతమైందని అధికార వర్గాలు బుధవారం ఇండియా టుడే టీవీకి తెలిపాయి.
ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత భారత్‌పై డ్రోన్ల దాడులను సమన్వయం చేసేందుకు తుర్కిష్ సలహాదారులు పాకిస్థాన్ సైనికాధికారులకు సాయపడ్డారని వర్గాలు తెలిపాయి. భారత్‌పై బైరక్తార్ టీబీ2. వైఐహెచ్ఏ డ్రోన్లను పాకిస్థాన్ ఉపయోగించింది.
ప్రధానంగా సరిహద్దుల్లో ఉన్న భారతీయ సైనిక పోస్టులపై, వాటికి ఆహారం సరఫరా చేసే కాన్వాయ్‌లపై దాడులు చేసేందుకు ఈ డ్రోన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో పాకిస్థాన్‌తో తుర్కియే వ్మూహాత్మక రక్షణ బంధాలు గణనీయమైన స్థాయిలో పెరిగాయి.