అయిజ, జూలై 9 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. మంగళవారం ఇన్‌ఫ్లో 22,200 క్యూసెక్కులు.. అవుట్‌ఫ్లో 156 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం గరిష్ఠ నీటినిల్వ 105.855 టీఎంసీలకు ప్రస్తుతం 20.851 టీఎంసీలు ఉన్నదని డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
నాగర్‌కర్నూల్, జూలై 9 : ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-3లో భాగమైన గుడిపల్లి రిజర్వాయర్‌కు నీటి విడుదల ప్రారంభమైంది. రెండో లిఫ్ట్‌లోని జొన్నలబొగుడ రిజర్వాయర్ వద్ద నీటి ఉధృతి పెరగడంతో రెండు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ పరుగు.. పరుగునా.. తరలిరాగా అధికారులు గుడిపల్లి వద్ద రెండో మోటర్‌ను ప్రారంభించి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ నిండగానే చెరువులకు విడుదల చేస్తామని డీఈ భద్రయ్య తెలిపారు.