తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 5.45 నుంచి 11 గంటల వరకు అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. మే 1 నుంచి కొత్త వేళలను అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గురువారం శ్రీవారి తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవ నేపథ్యంలో ఈ రెండు రోజులు పాత వేళలే కొనసాగుతాయని చెప్పారు.