Road Accident | రాజస్థాన్ జైపూర్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన దౌసా జిల్లా మండవార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వార్ నుంచి మహ్వా వైపు కూల్‌డ్రిక్స్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. మహ్వా నుంచి మండవార్ వైపు వెళ్తున్న జీపు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మహ్వా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడ్డ మరికొందరు జైపూర్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆయా వాహనాలను పోలీసులు జేసీబీ సహాయంతో తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.