కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ( Abhishek Banerjee ) మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సీబీఐ సమన్లు జారీ చేసింది. గోవుల అక్రమ తరలింపు కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. రేపు విచారణకు హాజరుకావాలని సీబీఐ పేర్కొన్నది.
స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్లో సీబీఐ, ఈడీ విచారణకు హాజరుకావాలని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో ఏప్రిల్ 24వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్నారు.