కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఏ పార్టీతో పొత్తు ఉండదని సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సోమవారం పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ‘హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆప్ సాయపడలేదు.
అలాగే.. ఢిల్లీలో ఆప్ గెలుపునకు కాంగ్రెస్ సహకరించలేదు. దీంతో రెండు రాష్ర్టాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక బెంగాల్లో కాంగ్రెస్ చేయడానికి ఏమీ లేదు. మనం ఒంటరిగానే బరిలోకి దిగుతున్నది’ అని చెప్పారు.