భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో గిరిజనులు అత్యవసర పరిస్థితుల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తా జా ఉదాహరణ కంధమాల్ జిల్లాలో జరిగిన హృదయవిదారక సంఘటన. దుమెరిపద గ్రామంలో బలమడు మాఝి అనే మహిళ శుక్రవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోతుండగా పాము కరిచింది. ఆమె కుటుం బ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.
రోడ్లు సక్రమంగా లేకఅంబులెన్స్ అక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వచ్చింది. దానిని చేరుకోవడం కోసం బాధితురాలిని ఆమె కుమార్తె రజని మాఝి అటవీ మార్గంలో 5 కి.మీ. వరకు వీపుపై మోసుకుని తీసుకెళ్లింది. సరముండి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి బైక్‌పై మరో మూడు కిలోమీటర్లు తీసుకెళ్లింది. బాధితురాలిని బలిగుడ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.