Nirbhaya | భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజన మహిళను ఇద్దరు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఖాండ్వా జిల్లా, ఖల్వా గిరిజన ప్రాంతంలో శనివారం రాత్రి 1 గంట సమయంలో ఈ దారుణం జరిగింది. ఢిల్లీ ‘నిర్బయ’ కేసు తరహాలో, బాధితురాలిపై అత్యాచారం జరిగింది. నిందితులు ఆమెను పొరుగింట్లోకి తీసుకెళ్లి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. మర్మాంగాల్లో ఐరన్ రాడ్‌ను గుచ్చారు.
ఆమె కడుపును కోసేసి, ఆమె పక్కన చెల్లాచెదురుగా పడేశారు. రక్తపు మడుగులో పడి, స్పృహ కోల్పోయిన ఆమెను ఆమె కుమార్తె చూసింది. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. పోస్ట్‌మార్టం పరీక్షల కోసం మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితులిద్దరూ బాధితురాలికి పరిచయస్థులేనని స్థానికులు తెలిపారు.