Kerala | ఖాకీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా శునకాలకు శిక్షణ ఇచ్చిన డ్రగ్ డీలర్
డ్రగ్ డీలర్ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా శునకాలు వారిపై దాడికి దిగాయి. ఖాళీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా వాటికి శిక్షణ ఇచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు షాక్‌కు గురయ్యారు.
Kerala | కొట్టాయం: డ్రగ్ డీలర్ ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా శునకాలు వారిపై దాడికి దిగాయి. ఖాళీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా వాటికి శిక్షణ ఇచ్చినట్టు తెలుసుకున్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. కేరళలోని కొట్టాయంలో ఈ ఘటన జరిగింది.
డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారం రావడంతో కేరళలోని కొట్టాయంలో ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీకి పోలీసులు వెళ్లారు. అయితే వారిపైకి ఒక్కసారిగా శునకాలు దూసుకొచ్చాయి. శునకాల నుంచి తమని తాము రక్షించుకునే క్రమంలో నిందితులు పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఖాళీ దుస్తులు వేసుకున్న వారిపై దాడి చేసేలా నిందితుడు శునకాలకు ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలియడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. దాడి సమయంలో నిందితుడి ఇంట్లో 13 శునకాలు ఉన్నట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

