Elephant | కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ( Bhupender Yadav) ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓ ఏనుగు ప్రసవిస్తున్న (elephant gives birth) సమయంలో రైలు (Train) దాదాపు రెండు గంటలపాటూ నిలిచిపోయినట్లు తెలిపారు.
ఈ ఘటన జార్ఖండ్ (Jharkhand)లో చోటు చేసుకుంది. ఓ ఏనుగు రైల్వే ట్రాక్‌పై (railway track) ప్రసవ వేదన పడుతోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు రైలు వస్తుండటాన్ని గమనించారు. వెంటనే దాన్ని ఆపేశారు. దాదాపు రెండు గంటల పాటూ ట్రాక్‌పైనే రైలు నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత గజరాజు తన బిడ్డకు జన్మనిచ్చి ఎంతో సంతోషంగా బిడ్డతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కేంద్రం మంత్రి ఎక్స్‌లో షేర్ చేశారు. ఏనుగు ప్రసవానికి సాయపడిన వారి సున్నితత్వానికి, జార్ఖండ్ అటవీ అధికారులను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.
కేంద్ర మంత్రి షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈరోజు ఓ మంచి వార్తను చూశాము సర్. షేర్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హృదయాన్ని హత్తుకునే ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Beyond the news of human-animal conflicts, happy to share this example of human-animal harmonious existence.
A train in Jharkhand waited for two hours as an elephant delivered her calf. The 📹 shows how the two later walked on happily.
Following a whole-of government approach,… pic.twitter.com/BloyChwHq0
— Bhupender Yadav (@byadavbjp) July 9, 2025
Also Read..
Gujarat University | గుజరాత్ యూనివర్సిటీలో కలకలం.. 100 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
Fighter Jet Crashes | రాజస్థాన్‌లో కూలిన యుద్ధవిమానం.. పైలట్ మృతి
Donkey Route Case: డాంకీ రూట్ కేసు.. పంజాబ్, హర్యానాలో ఈడీ సోదాలు