లక్నో: రైలుకు ప్రమాదం కలిగించేందుకు ముష్కరులు ప్రయత్నించారు. (Train Derailment Attempt) రైలు పట్టాలపై పొడవైన ఐరన్ పైపు, సిమ్మెంట్ పైపు ఉంచారు. లోకోపైలట్స్ సకాలంలో గుర్తించి రైలును నిలిపివేశారు. దీంతో రైలు పట్టాలు తప్పే ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి వేళ బల్వా గ్రామం సమీపంలోని రైలు పట్టాలపై పది అడుగుల పొడవైన ఇనుప పైపు, సిమ్మెంట్ పైపును ముష్కరులు ఉంచారు. సహరాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ప్యాసింజర్ రైలు లోకోపైలట్స్ సకాలంలో దీనిని గుర్తించారు. ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు.
కాగా, రైల్వే అధికారులు, పోలీసులకు ఈ సమచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. రైలు పట్టాలపై ఉంచిన పది అడుగుల పొడవైన ఇనుప పైపు, సిమ్మెంట్ గొట్టాన్ని పరిశీలించారు. రైలు డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రమాదం తప్పిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాధ్యులైన వారిని అరెస్ట్ చేస్తామని అన్నారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ట్రాక్‌ను క్లియర్ చేసిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ख़ौफ़नाक।
एक बार फिर भारतीय रेल के पलटाने की साज़िश,रेल ट्रैक पर रख दिया बड़ा सा लोहे का खंबा और जगह जगह पत्थर।
घटना: दिल्ली–सहारनपुर ट्रैक,शामली।@AshwiniVaishnaw @RailMinIndia @PMOIndia pic.twitter.com/ocyDfUNZmy
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) June 1, 2025
Also Read: