Train accident : ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రం బిలాస్పూర్ (Bilaspur) జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train accident) లో మృతుల సంఖ్య 11కు పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు (Korba passenger train) జయరామ్ నగర్ స్టేషన్ (Jairam Nagar station) వద్ద ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రంకల్లా మరో నలుగురు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది. తాజాగా మరో వ్యక్తి ఆస్పత్రిలో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 11కు పెరిగింది. మరో 25 మంది చికిత్స పొందుతున్నారు.
కాగా ప్రమాద సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను ట్రెయిన్ నుంచి వెలికితీశాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలించాయి.