Watch: ట్రాఫిక్ పోలీస్‌ను కారుతో ఈడ్చుకెళ్లిన డ్రైవర్.. వీడియో వైరల్
Traffic Cop Dragged | మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ రచ్చ చేశాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఆ కారు వద్దకు వెళ్లిన ట్రాఫిక్ పోలీస్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లాడు.
చండీగఢ్: మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ రచ్చ చేశాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఆ కారు వద్దకు వెళ్లిన ట్రాఫిక్ పోలీస్ వాహనం పత్రాలు చూపించాలని డ్రైవర్‌ను అడిగాడు. అయితే తప్పించుకునేందుకు ఆ డ్రైవర్ కారును వేగంగా ముందుకు నడిపాడు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్‌ను కొంత దూరం కారుతో ఈడ్చుకెళ్లాడు. (Traffic Cop Dragged) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ వాహనాన్ని రోడ్డు మధ్యలో ఆపాడు. ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
కాగా, ట్రాఫిక్ ఎస్ఐ దీనిని గమనించాడు. ఆ కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో మాట్లాడాడు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలుసుకున్నాడు. చలానా రాసేందుకు వాహనం ప్రతాలు అడిగాడు. అయితే ఆ కారు డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా కారు వేగం పెంచి ముందుకు నడిపాడు. డ్రైవర్ సీటు వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారిని కొంత దూరం కారుతో ఈడ్చుకెళ్లాడు.
మరోవైపు మిగతా పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించారు. ఆ కారును చుట్టుముట్టారు. ట్రాఫిక్ పోలీస్ అధికారిని కాపాడారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కారు నుంచి బయటకు వచ్చాడు. దీంతో ట్రాఫిక్ ఎస్ఐ అతడి చొక్కా పట్టుకుని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Ballabgarh, Faridabad: When the traffic signal turned red, an Inspector of Traffic Police requested vehicle documents from a driver, sparking a dispute between them. Subsequently, the driver accelerated, dragging the traffic policeman at high speed pic.twitter.com/LsY32fsGJL
— IANS (@ians_india) June 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

