Belly Fat | మనం బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కఠిన ఆహార నియమాలను పాటించడంతోపాటు రోజూ వ్యాయామం చేయడం, క్యాలరీలను తక్కువగా తీసుకోవడం ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అయితే కొందరిలో కాళ్లు, చేతులు వంటి ఇతర భాగాల్లో కొవ్వు కరిగినప్పటికీ పొట్ట భాగంలో మాత్రం కొవ్వు తగ్గదు. దీంతో వారు పొట్ట భాగంలో కొవ్వు కరగక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అంత మంచిది కాదు. దీని వల్ల హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బందులు పడే వారు వ్యాయామం చేయడం, చక్కటి ఆహారాన్ని తీసుకోవడంతోపాటు హెర్బల్ టీలను తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ హెర్బల్ టీ లు కొవ్వును తగ్గించడంలో, శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయడంలో ఎంతగానో సహాయపడతాయి.
గ్రీన్ టీ లో కాటెకిన్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి, గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. గ్రీన్ టీని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరగడంతో పాటు కాలేయంలో అధికంగా ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. పెప్పర్మెంట్ టీని తీసుకోవడం వల్ల శరీర బరువుతో పాటు పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ టీని తీసుకోవడం వల్ల గుండెల్లో మంట తగ్గుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. చర్మ ఆరోగ్యంతో మెరుగుపడడంతో పాటు చర్మం సహజమైన మెరుపును సొంతం చేసుకుంటుంది. ఈ టీని తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కనుక బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎప్పుడైనా ఈటీని తీసుకోవచ్చు.
శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడానికి కారణం మెటబాలిక్ సిండ్రోమ్. పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా పేరుకుపోవడం వల్ల జీవక్రియలో మార్పులు వస్తాయి. ఇది క్రమంగా మెటబాలిక్ సిండ్రోమ్ కు దారి తీస్తాయి. కనుక పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా ఉన్నవారు రోజూ పసుపు టీని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపు టీని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు తగ్గుతాయి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ఉండే కొవ్వు కరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. నిమ్మకాయ, దాల్చిన చెక్క టీని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు వేగంగా కరుగుతుంది. కొవ్వును కరిగించే ప్రభావవంతమైన పానీయాల్లో నిమ్మకాయ టీ ఒకటి. నిమ్మకాయలో విటమిన్ సి, పెక్టిన్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడతాయి. ఇక దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో మనం సులభంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
తులసి ఆకులు శరీర జీవక్రియను ప్రేరేపిస్తాయి. జీవక్రియ ఎంత వేగంగా జరిగితే క్యాలరీలు అంత ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో శరీరంలో ఉండే కొవ్వు నిల్వలు కూడా తగ్గుతాయి. కనుక తులసి టీని తీసుకోవడం వల్ల జీవక్రియ సహజంగా మెరుగుపడి పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఈ టీని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే విషాలు కూడా తొలగిపోతాయి. పొట్ట చుట్టూ అధికంగా ఉండే కొవ్వు మన శరీర అందాన్ని తగ్గించడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక ఈ పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా ఉన్న వారు, బరువు తగ్గాలనుకునే వారు ఈ హెర్బల్ టీలను తమ రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను, చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.