న్యూఢిల్లీ : గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లపై దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ నాలుగు కొత్త చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ సాధారణ సమ్మెను ఏ తేదీన చేయాలనే దానిపై ఈ నెల 22న నిర్ణయిస్తామని మంగళవారం ట్రేడ్ యూనియన్ల జాయింట్ ఫోరం తెలిపింది. లేబర్ కోడ్లతో కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫోరం ఆరోపించింది.