లండన్ : బీచ్ వద్ద పర్యాటకులు ఉన్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే కొండ చరియ విరిగిపడిన ఘటనలో టూరిస్టులు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు (Viral Video) సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
బ్రిటన్‌లోని డార్సెట్ వెస్ట్ బే ప్రాంతంలోని బీచ్ వద్ద 150 అడుగుల ఎత్తు నుంచి కొండ చరియలో ఓ భాగం కిందకు పడింది. డార్సెట్ కౌన్సిల్ ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ ఘటనతో తీర ప్రాంతంలోని పర్యాటకులు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.
Rockfalls and Landslips can happen at anytime. These people had a lucky escape. The South West Coast Path above the cliff at West Bay is currently closed. Thanks to Daniel Knagg for the footage.#Westbay #JurassicCoast pic.twitter.com/38XJjSoBYT
— Dorset Council UK (@DorsetCouncilUK) August 10, 2023
ఈ ఘటనతో కొండచరియపైనున్న సౌత్‌వెస్ట్ తీర మార్గాన్ని ముందుజాగ్రత్త చర్యగా మూసివేశామని కౌన్సిల్ ప్రకటించింది. బీచ్‌కు వచ్చిన టూరిస్టులు సకాలంలో స్పందించి కొండచరియ విరిగిపడిన ప్రాంతం నుంచి త్రుటిలో బయటపడటం వీడియోలో కనిపించింది.
Read More :
Cyber Fraud | వాటి వలలో పడకండి.. డేటింగ్ యాప్స్ యూజర్లకు కేంద్రం వార్నింగ్!