University shooting : అమెరికా (USA) దేశంలోగల రోడ్ ఐలాండ్ (Road Island) లోని బ్రౌన్ యూనివర్సిటీ (Brown Universidy) లో కాల్పులకు తెగబడిన నిందితుడి వీడియోను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు విడుదల చేశారు. ఆ వీడియోలో నిందితుడు ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వడివడిగా నడుచుకుంటూ వెళ్తూ కనిపించాడు. అతడి మొహం కనిపించడం లేదు.
దాంతో ఆ వీడియోను షేర్ చేసిన ఎఫ్బీఐ.. నిందితుడిని గుర్తించడంలో సహకరించాలని కోరింది. ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఫోన్ నెంబర్లు షేర్ చేసింది. గత రాత్రి యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ బిల్డింగ్లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన దుండగుడు కాల్పులు జరిపాడు.
వర్సిటీలోని ఏడంతస్తుల బారస్ అండ్ హోలీ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంజినీరింగ్ డిజైన్ పరీక్ష జరుగుతున్నదని అధికారులు వెల్లడించారు.
నిందితుడి కోసం వెతుకుతున్నట్లు మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. క్యాంపస్ సమీపంలో నివసించే వారు ఇళ్ల లోపలే ఉండాలని సూచించారు.
Help find this Person of Interest.
If you have any information, please call 1-800-CALL-FBI (225-5324) or https://t.co/iL7sD5efWD. pic.twitter.com/AkFDVtOCmw
— FBI (@FBI) December 14, 2025