Abhishek Sharma | టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ క్యాలెండర్ ఇయర్లో టీ20లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డుకు చేరువయ్యాడు. ఈ రికార్డు ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరిట ఉన్నది. 2016లో విరాట్ 31 మ్యాచుల్లో 89.66 సగటుతో 1,614 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఘనత సాధించడానికి అభిషేక్‌కు ఇప్పుడు కేవలం 87 పరుగులు మాత్రమే అవసరం. ఈ ఏడాది అభిషేక్ ఈ ఏడాదిలో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగులు సాధిస్తున్నాడు. అభిషేక్ 39 టీ20 మ్యాచుల్లో 41.43 సగటుతో 1,533 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో మూడు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు సాధించాడు. అభిషేక్ ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది.
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో అభిషేక్ పెద్దగా రాణించలేకపోయాడు. కటక్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో అభిషేక్ తక్కువ పరుగులకే అవుటయ్యాడు, కానీ బౌలర్ల బలంతో టీమ్ ఇండియా ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. న్యూ చండీగఢ్‌లో జరిగిన రెండో టీ20లో అభిషేక్ ఎనిమిది బంతుల్లో కేవలం 87 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు అభిషేక్ మూడో టీ20లో రాణించాలని కోరుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో మిగిలిన మూడు టీ20లలో అభిషేక్ బ్యాట్ రాణిస్తే.. కోహ్లీని వెనక్కి నెట్టి ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ ఆదివారం ధర్మశాలలో జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇప్పుడు సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భారత్ కసితో ఉన్నది. తొలి రెండు మ్యాచుల్లో భారత్ అదే ప్లేయింగ్ ఎలెవన్‌తో ఆడింది. అయితే, టీమ్ మేనేజ్మెంట్ తుదిజట్టులో ఏమైనా మార్పులు చేస్తుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.