Cyber Fraud | వాటి వలలో పడకండి.. డేటింగ్ యాప్స్ యూజర్లకు కేంద్రం వార్నింగ్!
గత కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు (Cyber Fraud) పెరిగాయి. ఆన్లైన్ వేదికగా స్కామర్లు రోజుకో తరహా స్కామ్‌తో అమాయకుల నుంచి అడ్డంగా దండుకుంటున్నారు.
న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు (Cyber Fraud) పెరిగాయి. ఆన్లైన్ వేదికగా స్కామర్లు రోజుకో తరహా స్కామ్‌తో అమాయకుల నుంచి అడ్డంగా దండుకుంటున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రాం, వాట్సాప్ స్కామ్‌లతో చెలరేగిన సైబర్ నేరగాళ్లు బాధితులే లక్ష్యంగా లేటెస్ట్గా డేటింగ్, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లను ఉపయోగించుకుంటున్నారు.
లింక్‌లు క్లిక్ చేయడం, ఆన్లైన్ టాస్క్‌లు పూర్తి చేయడం వంటి ట్రిక్స్‌ను దాటిన స్కామర్లు తాజాగా డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్స్‌ను ఎంచుకుని భాగస్వాములను నిలువునా ముంచేస్తున్నారు. ఖరీదైన గిఫ్ట్‌లు పంపామని, వాటిని ఎయిర్‌పోర్ట్‌లో విడిపించుకునేందుకు కస్టమ్స్ అధికారులకు పెద్దమొత్తంలో చెల్లించాలని చెబుతూ బాధితులను ముంచేస్తున్నారు. ఆపై దర్యాప్తు అధికారులమని చెబుతూ స్కామర్లు అమాయకులను బెదిరించి రూ. లక్షల్లో దండుకుంటున్నారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆయా యాప్ యూజర్లను హెచ్చరించింది.
యువత ఈ తరహా మోసాలకు బలవుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఆన్‌లైన డేటింగ్\రొమాన్స్ స్కామ్‌ల్లో బాధితులు సగటున రూ. 7996 కోల్పోతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మ్యాట్రిమోనియల్, డేటింగ్ స్కామ్స్ గురించి అవగాహన కల్పిస్తూ ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యక్తిగత ఖాతాలకు సంబంధించి భారత కస్టమ్స్ అధికారులు ఎవరూ ఎస్ఎంఎస్లు పంపడం, కాల్స్ చేయడం వంటివి చేయరని పేర్కొంది. ఆన్లైన్ లవర్స్ అందించే ఖరీదైన గిఫ్ట్‌ల వలలో పడవద్దని హెచ్చరించింది.
Read More :
Actor Vishal | లక్ష్మీ మీనన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

