Corona Virus | కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత నెలన్నరగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది. భారత్ (India)లోనూ వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకూ (మే 27 నాటికి) దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య వెయ్యి దాటింది.
ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,010కి చేరినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కేరళలో 400కిపైగా వైరస్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు నిర్వహించిన అధ్యయనాల్లో ఒమిక్రాన్ ఇతర వేరియంట్స్ కన్నా ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ.. తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో ఈ వేరియంట్ కారణంగా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు తేలింది. ఆయా దేశాల్లో ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య పెరిగింది. ఈ వేరియంట్ కారణంగా జనవరిలో చైనాలో మరోసారి ఇన్ఫెక్షన్ పెరుగుదల ఉండవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా జేఎన్.1 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.
Also Read..
Panchkula | హర్యానాలో విషాదం.. కారులో విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Encounter | జార్ఖండ్లో ఎన్కౌంటర్.. దళ కమాండర్ మృతి